తమిళ రంగం నుంచి తెలుగులో వచ్చి పక్కింటి కుర్రాడిగా ఉంటూ.. తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న నటుడు కార్తి. తెలుగు లోగిళ్ళలో ఇట్టే కలిసిపోయే నైజం ఉన్నట్లు అనిపించే ఆయన సినీ కెరీర్ కోలీవుడ్ నుంచే ప్రారంభమైంది. ఆయన తండ్రి నటుడు. ఇద్దరు కుమారల్లో ఒకరు "గజని" సూర్య కాగా, రెండవవాడు కార్తి. సినిమా వ్యామోహంతో అసిస్టెంట్‌గా మణిరత్నం దగ్గర కూడా పని చేసిన ఆయన ఎయిమ్ మాత్రం దర్శకుడు కావాలన్నదే.
కానీ అనుకోకుండా ఆయనలోని నటుడు వెలుగులోకి వచ్చాడు. తెలుగులో "నాపేరు శివ"తో మరింత దగ్గరయ్యాడు. సూర్యలో లేనిది కార్తీలో ఉన్నది... తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పడమే. ఆయన కుటుంబ సభ్యుడైన జ్ఞానవేల్ ప్రతి చిత్రాన్ని తమిళంలో తీసి తెలుగులో అనువాదం చేయడం పరిపాటి. లేటెస్ట్‌గా శుక్రవారంనాడు ఆయన నటించిన చిత్రం 'శకుని' విడుదలవుతుంది. ఈ సందర్భంగా కార్తీతో వెబ్‌దునియా మాటామంతీ.
'శకుని' అంటే అందరికీ తెలిసిన పేరు.. ఈ సినిమాలో ఆ పాత్ర ఎలా ఉంటుంది?
అవును. మహాభారతంలో శకుని పేరు వినని వారుండరు. అది నెగెటివ్‌లో కన్పించినా.. పెద్ద మేథావి పాత్ర. ఈ సినిమాలో నాది హైటెక్ కృష్ణుడు లాంటి పాత్ర. ఒక రకంగా చెప్పాలంటే.. పల్లెటూరి నుంచి పట్నం వచ్చిన వ్యక్తి కథ. కొత్తగా వచ్చినప్పుడు పట్టణంలో అంతా కొత్తగా కన్పిస్తుంది. అర్థం చేసుకునే టైమ్‌కు ఏదో అడ్డంకి అతన్ని అడ్డుకుంటుంది. అక్కడ నుంచే కథ మొదలవుతుంది.
ట్రైలర్స్ రాజకీయ నేపథ్యంలో కనబడుతున్నాయి. ఈనాటి ట్రెండ్‌కు సెటైరా?
సెటైర్ అనేది లేదు. సీరియస్‌గా ఉంటుంది. సినిమాలో కీలకమైన పాయింట్ రాజకీయమే. రాజకీయాల వైపు పల్లెటూరి నుంచి వచ్చిన వ్యక్తి ఎలా ఆకర్షించబడ్డాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు శంకర్ దయాళ్ ఈ కథను చాలా వివరంగా చెప్పారు.
కొత్తకొత్త కథల వైపు దృష్టిపెడతారు. ఇదే మీ సక్సెస్‌కు కారణమా?
సక్సెస్‌కు ఫలానా అని చెప్పలేం. నన్ను నేను కొత్తగా చూసుకోవాలనుకుంటాను. రొటీన్‌గా అన్ని సినిమాల్లో ఒకేలా కన్పిస్తే ప్రేక్షకుల కూడా చూడలేరు. కథలు కొత్తగా ఉంటేనే పాత్రలు కొత్తగా పుడతాయి. సినిమా చూసేవారు ప్రతీసారి అదే తరహాలో చూడాలంటే టిక్కెట్ కొనలేరు. నేను చేసిన ప్రతి సినిమాలోనూ వైవిధ్యంగా ఉండబట్టే తెలుగువారు ఈ మాత్రం ఆదరిస్తున్నారు. అయితే ప్రతిసారీ మా అంచనా కరెక్టే అని అనుకోవడంలేదు.
నాకంటే అన్నయ్య ప్రతి కథకు ఓపిగ్గా ఎదురుచూస్తుంటాడు. ఏదిబడితే అది దొరికింది కదా అని చేయలేడు. ఇందులో అన్నయ్యను ఆదర్శంగా తీసుకుంటాను. కానీ అన్నయ్య కంటే నేను చాలా విషయాల్లో పూరే. ఏ రంగమైనా కానీ, ప్రతి విషయాన్ని తెలుసుకుంటాడు.
మీ మధ్య పోటీ ఉందనుకుంటున్నారా?
అదేంలేదు. ఇదేం చిన్న పిల్లల ఆట కాదు. సినిమా వ్యాపారం. కెరీర్.. నాకంటే అన్నయ్య చాలా ఫాస్ట్‌గా ఉన్నాడు. ఆయనతో నేను పరుగెత్తలేను.
మీరిద్దరూ తెలుగు హీరోలకు ఆదర్శం కావాలని ఆమధ్య వినాయక్ వంటివారు అన్నారు. దీనిపై మీరెలా స్పందిస్తారు?
నా సినిమా ఆడియో వేడుకల్లో ప్రముఖులంతా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా వారందరికీ చాలా థ్యాంక్స్ చెబుతున్నాను. తెలుగులో చాలా మంచి హీరోలున్నారు. మేం వారి తర్వాతే. వారు మామీద అభిమానంతో అలా అని ఉండవచ్చు.
మీతో సమానంగా హీరోయిన్ పాత్ర కావాలనుకుంటారా? లేదా.. నామ్‌కేవాస్తే అని సూచిస్తారా?
రచయిత దర్శకుడు కథ ఏం అనుకుని వచ్చారో దాన్నివినడం వరకే నా పని... అందులో హీరోయిన్ పాత్ర, విలన్ పాత్ర ఇలా ఉండాలి. నాకంటే తక్కువ ఉండాలనేది అస్సలు పట్టించుకోను. ఇది దర్శకుడు నాలెడ్జ్‌కు సంబంధించింది. నాది నటనకు సంబంధించింది.
మల్లిగాడులో ప్రియమణి పాత్ర చాలా గొప్పగా చూపించారు. నా పేరు శివలో కాజల్ పాత్రకు కథ రీత్యా అంత అవకాశం రాలేదు. నాయికానాయక పాత్రలు, ప్రతినాయక పాత్రలు సమాన స్థాయిలో ఉంటేనే కథ రక్తి కడుతుంది.
స్ట్రెయిట్ తెలుగులో నటించే ఆలోచన ఉందా?
ఆమధ్య ఓ నిర్మాత నన్ను అడిగారు. తెలుగు బాగా వచ్చుకదా.. చేయమని ఆఫర్ కూడా ఇచ్చారు. అన్నీ అనుకూలిస్తే తప్పకుండా చేస్తాను.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment