దేశముదురు చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన హన్సిక ప్రస్తుతం పలు దక్షిణాది సినిమాల్లో బాగానే రాణిస్తోంది. హీరోయిన్లపై రకరకాల పుకార్లు రావడం మామలే. ఈ క్రమంలో ఈ మధ్య హన్సికపై కూడా కొన్ని తమిళ పత్రికల్లో వార్తలు వచ్చాయి. హన్సికకు ప్రభుదేవాతో ఎఫైర్ ఉందని, అందుకే నయనతార-ప్రభుదేవాల బంధం చెడిందని ఆ వార్తల సారాంశం.
దీనిపై హన్సిక స్పందిస్తూ...ఈ వార్తలను కొట్టి పారేసింది. ప్రభుదేవా నాకు అన్నయ్య లాంటోడు, మా ఇద్దరిపై ఇలాంటి వార్తలు రావడం చాలా బాధ పెట్టింది. ఇలాంటి అసత్య వార్తలను, అర్థం పర్తంలేని కథనాలను రాయొద్దని ట్విట్టర్ ద్వారా మీడియాను వేడుకొంది.
హన్సిక త్వరలో ఓ తెలుగు చిత్రంలో నటించనుంది. మంచు విష్ణువర్థన్ బాబు, హన్సిక జంటగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ట్వంటీఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రం ఇప్పటికే ప్రారంభమైంది. వినోదాత్మకంగా ఈ చిత్రం రూపొందనుంది.
ఈ చిత్రానికి కథ- బి.వి.ఎస్.రవి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: మరుధూరి రాజా, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: సిద్దార్థ్ అందిస్తున్నారు. ఎన్.వంశీకృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తెర వెనుక పనిచేస్తున్న వారిలో వర్మ, సెల్వ, రఘు కులకర్ణి, సాయిజ్యోతి, విజయ్ శ్రీనివాస్, సురేష్‌బాబు, నరసింహ, వాసు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కరభట్ల,రామజోగయ్యశాస్త్రి తదితరులు ప్రముఖంగా ఉన్నారు.

Post a Comment