బేతాళుడు-విక్రమార్కుడు కథల గురించి మన చిన్నప్పుడు చందమామ పుస్తకాల్లో చదువుకున్నాం. ఎన్నో ట్విస్టులతో ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగే ఈ కథలను పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ త్వరలో ఓ సోషియా ఫాంటసీ చిత్రంలో నటించబోతున్నారని, ఈ చిత్రం బేతాళ-విక్రమార్క కథల ఆధారంగా ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రం 1960ల్లో వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ సినిమా ‘భట్టి విక్రమార్క’ సినిమాను పోలి ఉంటుందని అంటున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అప్పట్లో వచ్చిన రామారావు సినిమా ‘భట్టి విక్రమార్క’ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్ కింగ్ విక్రమార్క పాత్రలో, కాంతారావు బట్టి పాత్రలో, ఎస్వీ రంగారావు మాంత్రికుడి పాత్రలో, అంజలి దేవి ప్రభావతిదేవి పాత్రలో నటించారు. ఈ చిత్రం రీమేక్ ఆధారంగానే బాలయ్య సినిమా ఉంటుందని, ఈ చిత్రాన్ని శ్రీరామరాజ్యం నిర్మాత యలమంచిలి సాయిబాబు నిర్మించనున్నారని ఫిల్మ్ నగర్ గుసగస.

Post a Comment