యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఒకే సారి రెండు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఒకటి లారెన్స్ దర్శకత్వంలో ‘రెబల్’ చేస్తుండగా.....కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పేరు ‘వారధి’ అని గత కొంత కాలంగా మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యూనిట్ సభులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. ‘వారధి’ అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని, అంతకంటే పవర్ ఫుల్ టైటిల్ పెట్టే ఆలోచన చేస్తున్నామని, ప్రభాస్ ఇమేజ్‌కు తగిన విధంగా మరో మంచి టైటిల్ కోసం వెతుకున్నామని అంటున్నారు.
వారధి(వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని ప్రమోద్ ఉప్పలపాటి మరియు వంశి కృష్ణ శ్రీనివాస్ సంయుక్తం గా యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అనుష్క, రీచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ చిత్రం ద్వారా తన టాలెంట్ ఏమిటో చూపించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తలుక్ లో చూపించడంతో పాటు, కేక పుట్టించే డైలాగులు సినిమాలో వినిపించనున్నాయి.
దీంతో పాటు ప్రభాస్ లారెన్స్ దర్శకత్వంలో ‘రెబల్’ చిత్రంలో నటిస్తున్నాడు. రెబల్ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె పుల్లారావు, జె భగవాన్ నిర్మిస్తున్నారు. దర్శకుడు రాఘవ లారెన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈరెండు సినిమాలు పూర్తయిన తర్వాత ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్నాడు.

Post a Comment