.
Home » » రాజమౌళి రేంజ్ గురించి సమంత కామెంట్స్

రాజమౌళి రేంజ్ గురించి సమంత కామెంట్స్

Written By Hot nd spicy on Thursday, 2 February 2012 | 18:26

ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం ‘ఈగ’ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో కనిపించనుంది. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం గురించి సమంత మాట్లాడుతూ రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తింది. ఈగ చిత్రం భారతీయ సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని, భారత దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతోందని చెప్పుకొచ్చింది. ఈచిత్రంలో సన్నివేశాల చిత్రీకరణకు స్పెషల్ టెలిస్కోపిక్ కెమెరాలు వాడుతున్నారని, ప్రత్యేక క్రేన్ లతో పాటు అద్భుతమైన సాంకేతిక విలువలు ఇందులో ప్రేక్షకులు చూడబోతున్నారని వెల్లడించింది. రాజమౌళి ఎంత గొప్ప దర్శకుడో ఈగ చిత్రం ద్వారా ఈ దేశ ప్రేక్షకులకు తెలుస్తుందనే రేంజ్ లో సమంత వ్యాఖ్యానించింది. ఈ ఏడాది వేసవిలో ఈగ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఏ మాయ చేశావె, బృందావనం, దూకుడు ఇలా తను తెలుగులో నటించి చిత్రాలన్ని భారీ విజయం సాధించిన నేపథ్యంలో....‘ఈగ’ చిత్రంపై కూడా అదే నమ్మకంతో ఉంది సమంత. సమంత ఈ చిత్రంతో పాటు ప్రస్తుతం మహేష్ బాబుతో కలసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, నాగచైతన్యతో కలిసి ‘ఆటోనగర్ సూర్య’ చిత్రాల్లో నటిస్తోంది. రామ్ చరణ్-వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రాబోతోతున్న ‘ఎవడు’ చిత్రంలో కూడా సమంతను ప్రధాన నాయికగా ఎంపిక చేశారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger