షారుఖ్ రేంజ్ ఎక్కడ..అల్లు అర్జున్ స్థానం ఎక్కడ? అంత పెద్ద హీరోతో మన బన్నీ పోటీ పడటం ఏమిటా...? అని ఆలోచిస్తున్నారా. పోటీ నిజమే కానీ ఇది సినిమాల విషయంలో ఎంత మాత్రం కాదు. ఓ వాణిజ్య ప్రకన విషయంలో. బన్నీని కోల్గేట్ టూత్ పేస్ట్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ఏరియాకు తమ బ్రాండ్ అంబాసిడర్ నియమిస్తూ ఒప్పందం కుదకర్చుకుంది. బన్నీ ముఖ్యంగా యూత్ ఇష్టపడే కోల్గేట్ మాక్స్ ఫ్రెష్ జెల్ తరుపున ప్రచారం చేయనున్నాడు. ఈ మేరకు బన్నీకి భారీ అమౌంట్(కోటికిపైనే) ఆఫర్ చేసినట్లు సమాచారం.
ఇప్పటికే టూత్ పేస్ట్ మార్గెట్‌లో కోల్గేట్‌కు పోటీగా ఉన్న పెప్సోడెంట్ కంపెనీకి బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో షారుఖ్‌ఖాన్ చేస్తున్న పెప్సోడెంట్ ప్రచారానికి.... బన్నీ చేస్తున్న కెల్గెట్ ప్రచారం ఏ మాత్రం పోటీ ఇస్తుందనే చర్చ మొదలైంది.
బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ నటిస్తోంది. హారిక హాసిని ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా డివివి దానయ్య సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

Post a Comment