ముంబైలోని కామాటిపుర రెడ్ లైట్ ఏరియాలలో రీసెంట్ గా ఓ పదిహేను రోజులు పాటు శ్రద్దాదాస్ తిరిగింది. అక్కడ పరిస్ధితులను ఆమె శ్రద్దగా పరిశీలించింది. దానికి కారణం ఆమె తన తాజా చిత్రం 'ఇండియా షైనింగ్' లో సెక్స్ వర్కర్ పాత్రను పోషిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ దర్సకుడు ప్రకాష్ ఝా శిష్యుడు విజయ్ మండల్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ గా సాగుతుంది. ఈ చిత్రాన్ని ప్రకాష్ ఝా స్వయంగా నిర్మిస్తూ పర్యవేక్షిస్తున్నారు.
ఈ చిత్రం కథ గురించి దర్సకుడు చెపుతూ...చిన్నప్పుడు పుస్తకాల్లో ఇండియా షైనింగ్ అనే కథని పుస్తకాల్లో చదువుకున్న ఓ స్కూల్ అమ్మాయి బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపబడుతుంది. ఆ తర్వాత ఆమె ఆ సిస్టమ్ నుంచి బయిటకు ఎంతో కష్టపడి పోరాడి బయిటకు వస్తుంది. వచ్చాక ఆమె రాజకీయాల్లోకి వెళ్లి ఎక్సప్లాయిటేషన్ కి గురి అవుతున్న సెక్స్ వర్కర్స్ రక్షించే విధంగా చట్టం తీసుకు వస్తుంది. గతంలో హిందీలో శ్రద్దాదాస్ లాహోర్,దిల్ తో బచాహై జీ చిత్రాల్లో నటించింది. ఆమె అయితేనే ఆ పాత్రకు న్యాయం చేసినట్లు ఉంటుందని దర్శకుడు భావిస్తున్నారు. ఇక తెలుగులో శ్రద్దాదాస్ ఈ మధ్యన వచ్చిన మొగుడు చిత్రంలో సైతం కీ రోల్ చేసింది కానీ ఏ పాత్రా ఆమెకు కెరీర్ కు ఉపకరించటం లేదు.

Post a Comment