అమ్మ అయిన ఐశ్వర్యారాయ్ త్వరలో మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నది. బాలీవుడ్ సమాచారం ప్రకారం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150 చిత్రంలో ఐష్ హీరోయిన్‌గా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు భోగట్టా.
మరోవైపు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌తో కూడా ఐశ్వర్యా రాయ్ నటించనుందనే వార్తలు తిరుగాడుతున్నాయి. చిరంజీవి ఠాగూర్ చిత్రాన్ని హిందీలో షారుక్ హీరోగా ఐష్ హీరోయిన్‌గా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయట. ఐష్ ఓకే అంటే దర్శకుడు మురుగదాస్ చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధంగా ఉన్నారట.
ఐతే ఐశ్వర్యారాయ్ తిరిగి సినిమాల్లో నటించేందుకు తల ఊపితే.. సంజయ్‌దత్, అజయ్ దేవగణ్ లాంటి హీరోలు కూడా ఆమెతో చిత్రాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారట. మొత్తానికి అమ్మ అయినప్పటికీ ఐష్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదన్నమాట.

Post a Comment