తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు, దగ్గుబాటి యువ హీరో రాణా మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ వారసత్వంతో పరిశ్రమలో అడుగు పెట్టిన వారే. సినీ రంగంలోని సంపన్న కుటుంబాలకు చెందిన వారే. నటన విషయానికొస్తే ఇద్దరూ తమదైన శైలి ప్రదర్శిస్తు సొంత టాలెంట్‌పై పైకొస్తున్న వారే.
అయితే మహేష్ బాబు చాలా రోజు క్రితమే పరిశ్రమలో అడుగుపెట్టి ప్రస్తుతం ఇండస్ర్టీ నెం.1 స్థానం కోసం పోటీ పడుతున్నాడు. రాణా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న హీరో. అందువల్ల స్టార్ రేంజ్ విజయంలో ఇద్దరీ ఒకేగాటిన కట్టలేం. అయితే ట్విట్టర్ క్లబ్‌లో మాత్రం రాణా మహేష్ బాబు రేంజ్ దాదాపు అందుకున్నాడు.
మహేష్ బాబు ఇప్పటికే 2లక్షల ఫాలోవర్స్ ఉన్న క్లబ్‌లో స్థానం దక్కించుకోగా.....రాణా కూడా కూడా 2 లక్షల ఫాలోవర్స్ కు చేరువగా వచ్చాడు. ఇప్పటి వరకు రాణాకు 1,99,991 ఫాలోవర్స్ ఉన్నారు. రేపో మాపో రెండు లక్షల మార్కును దాటి మహేష్ బాబు రేంజ్ అందుకోనునున్నాడు. మొత్తం తెలుగు సినీ సెలబ్రిటీల్లో ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ, మహేష్ బాబు మాత్రమే ఈ మార్కును దాటారు. తాజాగా ఇప్పుడు రాణా కూడా చేరబోతున్నాడు.
ప్రస్తుతం రాణా బాలీవుడ్ లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘డిపార్ట్ మెంట్’ చిత్రంతో పాటు, తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక మహేష్ బాబు బిజినెస్ మేన్ హిట్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. త్వరలో ఆయన దిల్ రాజు బ్యానర్లో వెంకీ తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు’ అనే మల్టీ స్టారర్ చిత్రంలో నటించనున్నాడు.

Post a Comment