అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇలియానా హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రానికి ‘జులాయి’ అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం కథపై ఫిల్మ్ నగర్ లో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. వారు చెప్పేదాని ప్రకారం ఈ చిత్రం అప్పట్లో వెంకటేష్, త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ కాంబినేషన్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రం తరహాలో ఉండబోతోందని చెప్తున్నారు. అల్లు అర్జున్ పాత్ర పూర్తిగా అలాంటిదేనని ఆ సినిమాలిటీస్ స్పష్టంగా కనపడతాయని అంటున్నారు. ఇక ఈ చిత్రం బ్యాంక్ రోబరీ నేపధ్యంలో రొమాంటిక్ కామెడీ గా జరుగుతుంది. రాజేంద్రప్రసాద్ పోలీస్ గా కనపడనున్నారు.
సోసూసూద్ ఈ చిత్రంలో మెయిన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న పాటలు మే నెలలో ఆడియో విడుదల చేయనున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ సీన్ల చిత్రీకరణ వైజాగ్‌లో ఆర్.కె.బీచ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అల్లు అర్జున్, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, ఇలియానా క్లైమాక్స్ సీన్ల చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
Post a Comment