తెలుగుదేశం పార్టీపై పట్టు సాధించడంలో భాగంగా నందమూరి, నారా కుటుంబాల మధ్య కోల్డ్ వార్ జరుగుతుండటం...అల్లుడిపై మమకారంతో బాలయ్య చంద్రబాబు పక్షాన నిలుస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలయ్యకు, జూనియర్ ఎన్టీఆర్‌కు పడటం లేదనే వాదన తెరపైకి వచ్చింది. ఈ మధ్య ఇద్దరి మధ్య దూరం పెరిందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేసేలా మరో సంఘటన చోటు చేసుకుంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల ఆడియో వేడుకలకు హాజరయ్యే బాలయ్య....దమ్ము ఆడియో వేడుకలో మాత్రం కనిపించలేదు. ఇద్దరి మధ్య మన స్పర్థలే ఇందుకు కారణం అంటున్నారు.
అయితే.... బాలయ్య, జూ ఎన్టీఆర్ అంటే ఎంతగానో అభిమానించే నందమూరి అభిమానులు ఇద్దరి మధ్య ఈ గ్యాప్‌ను భరించలేక పోతున్నారు. ఐకమత్యంగా ఉంటేనే బలం ఉంటుందని, ఇద్దరు కలిసి ఉంటేనే పరిశ్రమలో నందమూరి హీరోల సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఇద్దరూ కలవాలని, అప్పుడే అభిమానుల్లో కూడా మనో నిబ్బరం పెరుగుతుందని అభిప్రాయ పడుతున్నారు.
అయితే బాలయ్య చారిటీ ఫండ్‌రైజింగ్ కార్యక్రమంలో భాగంగా లండన్‌లో ఉన్నారని, అందుకే రాలేక పోయారని కొందరు నందమూరి అభిమానులు అంటున్నారు. వారి మధ్య ఎలాంటి విబేధాలు లేవని నొక్కి వక్కానిస్తున్నారు.
Post a Comment