"ఈగ" ఆడియో కోసం ఏడుగురు హీరోలు!
నాని ఈగ ఆడియో వేడుకకు టాలీవుడ్ నుంచి ఏడుగురు హీరోలు అటెండ్ కాబోతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. ఆయనతో పనిచేసిన హీరోలంతా ఈ వేడుకకు హాజరు కావడం విశేషం. ప్రభాస్, ఎన్.టి.ఆర్, సునీల్ మరో నలుగురు హాజరుకానున్నారు. ఈ ఆడియోవేడుకను గచ్చిబౌలిలోని బ్రహ్మ సమాజం దగ్గర ఆడిటోరియంలో ఘనంగా జరగనుంది. విశేషమేమంటే.. ఇక్కడే నాని పెండ్లి కూడా జరగనున్నదని వార్తలు విన్పిస్తున్నాయి. ఫిలింనగర్ కథనం ప్రకారం... వైజాగ్‌కు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థినితో వారి తల్లిదండ్రులు వీరి తల్లిదండ్రులు.. ఓకే చేశారని తెలిసింది. తాజాగా నాని 'ఎటో వెళ్ళిపోయింది మనసు'లో నటిస్తున్నాడు. గౌతమ్ మీనన్ దర్శకుడు.
Post a Comment