పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాయపడ్డాడు. గబ్బర్ సింగ్ షూటింగులో భాగంగా హార్స్ రైడింగ్ సీన్లు చిత్రీకరిస్తుండగా అతను గాయ పడ్డట్లు సమాచారం అందింది. ఈ సంఘటనలో పవన్ కండరాలకు తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గుజరాత్‌లో జరుగుతోంది. ఇక్కడ పవన్ పై హీరో ఇంట్రడక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఈ ఘటనతో ప్రస్తుతం షూటింగ్ నిలిపివేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కొండవీడు పోలీస్‌గా నటిస్తున్నాడు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీలో సూపర్ హిట్టయిన దబాంగ్ చిత్రానికి రీమేక్. దబాంగ్ చిత్రంలో ఐటం సాంగు చేసిన మలైకా అరోరా..ఈ చిత్రంలోనూ ఐటం సాంగు చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాత ఇప్పటికే ప్రకటించారు. ఏప్రిల్ మొదటి వారంలో ఈచిత్రం ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
వరుస ప్లాపులతో సతమతం అవుతున్న పవర్ స్టార్ కెరీర్‌ను మళ్లీ గాడిలో పెట్టాలని కృతనిశ్చయంతో ఉన్న దర్శకుడు హరీష్ శంకర్...ఆయన గత సినిమాలు ఎందుకు ప్లాప్ అయ్యాయి? ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారు? అనే అంశాలను విశ్లేషించి ఈ సినిమాలో వాటిని బాగా దట్టించి రూపొందిస్తున్నాడని తెలుస్తోంది.
Post a Comment