ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చి బెడిసి కొట్టాక నయనతార ఒంటరైపోయింది. ఇంట్లో కూడా తనను అర్థం చేసుకునే ఆత్మీయులు లేక పోవడంతో చాలా అప్ సెట్ గా ఉంటోంది. ఈ నేపథ్యంలో నయనతార కొత్త బాయ్ ఫ్రెండ్ ఆమెను ఓదారుస్తూ నయనను రిలాక్స్ చేస్తున్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్ ఇంకెవరో కాదు తమిళ హీరో ఆర్య. ఈ ఇద్దరు కలిసి గతంలో ‘బాస్ ఎన్‌గిరభాస్కరన్’ చిత్రంలో కలిసి నటించారు. ఇదే చిత్రం తెలుగులో ‘నేనే అంబానీ’ పేరుతో విడుదలైంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నటించక పోయినా ఫ్రెండ్షిప్ మాత్రం కంటిన్యూ అవుతోంది.
తాజాగా ఈ ఇద్దరు బిల్లా 2 చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా బాధల్లో ఉన్న నయనతార ఆర్యకు మరింత దగ్గరవుతోందట. హిందీలో హిట్టయిన ఢిల్లీ బెల్లీ సినిమా తమిళ రీమేక్‌లో ఆర్య హీరోగా ఎంపికయ్యాడు. ఈ చిత్రంలో నయనతారను హీరోయిన్‌గా రికమండ్ చేసే వరకు వెళ్లింది వ్యవహారం. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ మొదలవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆర్య ఇంట్లో ఏర్పాటు చేసిన పార్టీలో కూడా నయనతార తళుక్కుమనడం అంతటా చర్చనీయాంశం అయింది.
గతంలో శింబుతో కూడా నయనతార ఇలానే ఫ్రెండ్షిప్ మొదలు పెట్టి పీకల్లోతే ప్రేమలో మునిగింది. వారిద్దరూ రహస్యంగా ఓ గదిలో ముద్దులతో రొమాన్స్ చేసుకున్న ఫోటోలు కూడా బయటకు లీకయ్యాయి. ఇద్దరు పెళ్లి చేసుకుంటారనే తరుణంలో అనుకోని కారణాలతో విడిపోయారు. ఆ తర్వాత ప్రభుదేవాను ప్రేమించిన నయన అతడితో పెళ్లికి సిద్దమైంది. ఈ విషయమై ఇద్దరూ స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చారు. నయన కోసం ప్రభుదేవా తన భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. ఏమైందో ఏమోకానీ ఈ బంధం కూడా అర్ధాంతరంగా తెగి పోయింది. ఇప్పుడు నయనతార లైన్లోకి ఆర్య వచ్చాడు. మరి వీళ్ల వ్యవహారం ఎక్కడి వరకు వెలుతుందో చూడాలి.
Post a Comment