రామ్ చరణ్ తాజా చిత్రం రచ్చ రిలీజ్ కు ముందే రకరకాల రికార్డులను నెలకొలుపుతూ అందరిలో ఆసక్తి కలగచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం దర్శకుడుపై ఇండస్ట్రీలో రకరకాల అంచనాలు ఏర్పడ్డాయి. రచ్చ హిట్టైతే అతనితో చేయటానికి బన్నీ, మహేష్ బాబు ఆసక్తి చూపిస్తన్నట్లు సమాచారం. అందుకే వారిద్దరూ చాలా ఆసక్తిగా రచ్చ రిలీజ్ కోసం ఎదురచూస్తున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే సంపత్ నంది ని చాలా మంది నిర్మాతల ఎప్రోచ్ అయినట్లు సమచారం.
సినిమా విడుదల అయ్యాక తదుపరి చిత్రాలు గురించి ఆలోచిస్తానని సంపత్ నంది క్లియర్ గా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక చిన్న చిత్రం ఏమైంది ఈ వేళ తో దర్శకుడుగా మారిన సంపత్ నందికి వెంటనే రామ్ చరణ్ డేట్స్ ఇవ్వటం,అతనిపై అంత బడ్జెట్ పెట్టడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఒకటికి పదిసార్లు ఆలోచించే మెగా క్యాంప్ ఒక దర్శకుడుకి ఛాన్స్ ఇచ్చిందంటే అతని ట్యాలెంట్ ఓ రేంజి అని ఆలోచనలో పడుతున్నారు. ఇక రచ్చ చిత్రం ఏప్రియల్ 5న విడుదల కానుంది.
Post a Comment