.
Home » » 15న నందీశ్వరుడు

15న నందీశ్వరుడు

Written By Hot nd spicy on Thursday, 12 January 2012 | 08:37

నందమూరి తారకరత్న టైటిల్‌రోల్‌ పోషించగా, జగపతిబాబు పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో నటించిన ‘నందీశ్వరుడు’ చిత్రం 11న సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెన్సార్‌ సభ్యుల అభినందనలు, ప్రశంసలను పొందింది. ఈ చిత్రాన్ని 15న సంక్రాంతి పర్వదినాన విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలలో ఒకరైన డా.గంగాధరరెడ్డి.కె తెలియజేశారు. శీను యరజాల దర్శకత్వంలో కె.ఎఫ్‌.సి మరియు ఎస్‌.ఆర్‌.బి. ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అత్యంత భారీస్థాయిలో అత్యధిక కేంద్రాలలో విడుదల చేస్తున్నారు.
భారీ తారాగణంతో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్‌, కెమెరా: సుధాకర్‌రెడ్డి, సంగీతం: పార్ధు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: యువరాజ్‌, నిర్మాతలు: డా. కోట గంగాధర్‌రెడ్డి, కె.సేగు రమేష్‌బాబు, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీను యరజాణ


Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger