“నాకు స్నేహమంటే ఇష్టం. స్నేహానికి విలువిస్తా. అందుకే ఫ్రెండ్ షిప్‌కు సంబంధించిన బుల్లితెర కార్యక్రమంలో పాల్గొనడానికి ఒప్పుకున్నా” అని చెప్పుకొస్తోంది అసిన్. బాలీవుడ్‌లో కత్రినా, కరీనా, ప్రియాంకా, విద్యాబాలన్‌ల హవా నడుస్తోంది. వీళ్ళ పోటీని తట్టుకుని అసిన్ ముందుకెళ్ళాల్సి ఉంది.
చేతిలో చిత్రాలున్నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ భామ బుల్లితెరకు వెళ్ళిందని బాలీవుడ్ గుసగుసలాడుతోంది. కానీ అసిన్ మాత్రం “అలాంటిదేమీ లేదు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే నేరుగా అభిమానులను కలుసుకుని మాట్లాడవచ్చు. మాలాంటి తారల నుంచి వారు ఎలాంటి చిత్రాలు కోరుకుంటున్నారో తెలుసుకోవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే టీవీ షోలో పాల్గొనడానికి ఒప్పుకున్నా” అని వివరించింది.
Post a Comment