.
Home » » 20న జీవా ‘రౌద్రం’

20న జీవా ‘రౌద్రం’

Written By Hot nd spicy on Thursday, 12 January 2012 | 08:31

జీవా, శ్రీయ జంటగా ఎస్‌విఆర్ మీడియా పతాకంపై తెలుగులో వస్తున్న చిత్రం ‘రౌద్రం’. గోకుల్ దర్శకత్వంలో శోభారాణి ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈనెల 20న విడుదలకు సిద్ధమైంది. శోభారాణి మాట్లాడుతూ ఇటీవల విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, విభిన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రం జీవా కెరీర్‌కు ప్లస్ పాయింట్‌గా నిలుస్తుందని, క్లైమాక్స్‌ను తెలుగు సినిమాల నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి, రీ షూట్ చేశామని తెలిపారు. ప్రకాష్‌రాజ్, జెపి, లక్ష్మీరామకృష్ణ, వౌనిక, చైతన్యకృష్ణ, గణేష్‌ఆచార్య, బాబ్ ఆంథోనీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రకాష్ నిక్కీ, కెమెరా: షణ్ముగ సుందరం, ఫైట్స్: కణల్ అరసు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోకుల్.

Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger