నయనతార, ప్రభుదేవా మధ్య ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిందనే సంగతి తెలిసిందే. దాంతో ఎవరికి వారు తమ తమ సినిమాల్లో బిజీ అయ్యిపోయారు. ఈ విషయమై నయనతార అక్కడక్కడా మీడియాలో మాట్లాడింది కానీ ప్రభుదేవా మాత్రం నో కామెంట్ అన్నట్లుగా మౌనం వహిస్తూ వచ్చారు. అయితే తాజాగా తన మనస్సులోని మాటలను మీడియా వద్ద బయిటపెట్టారు.
ప్రభుదేవా మాట్లాడుతూ... నా లవ్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడాలనే చాలా సార్లు అనుకొన్నాను. కానీ నా ఆలోచనలు వాటిని బయిటకు మాట్లాడనివ్వకుండా చేస్తున్నాయి. నిజానికి ఆమెను నేను మరచిపోయాను అన్నారు. ప్రభుదేవా, నయనతార ప్రేమించుకొన్నారు. కొద్ది నెలల కిందట విడిపోయారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం తన ఆలోచనలన్నీ సినిమాల గురించే అంటున్నారు ప్రభుదేవా.
అలాగే ''ఏ విషయమైనా బాహాటంగా మాట్లాడటం నయనతార పద్ధతి. వాటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చెబుతున్న విషయాలు నన్ను బాధించవు. నేను దేవుణ్ని నమ్ముతాను. జరిగేదంతా దైవ అనుగ్రహం వల్లేనని భావిస్తున్నా. ఆయన నన్ను మంచి దారిలో తీసుకెళ్తున్నారు'' అన్నారు.
ఇక తన తాజా చిత్రం విక్రమ్ రాధోర్ బాలీవుడ్ లో మెగా హిట్ అవటం పట్ల సంతోషం వెల్లబుచ్చారు. సల్మాన్‌ఖాన్‌తో మరోసారి పని చేయాలనే ఆలోచన ఉందని ప్రభు తెలిపారు. త్వరలో తాను చేయబోయే తదుపరి చిత్రం వివరాలు ప్రకటిస్తాను అన్నారు. అయితే రీమేకా లేక కొత్త స్క్రిప్టు అన్నది నిర్ణయించుకోలేదని అన్నారు. ఓ ప్రెష్ ప్రేమకథ చేయాలని ఉందని అన్నారు.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment