సినీ ఇండస్ట్రీలో పెద్దలు కోట్లను రూపాయలుగా మాట్లాడుకుంటారు. రామానాయుడుగారయితే... ఫలాన సినిమాకు రెండు రూపాయలు పోయాయంటూ.. భలే చమత్కారంగా చెబుతారు. ఇలాగే చాలామంది ఉన్నారు. ప్రస్తుతం త్రిష కూడా రూపాయి పోగొట్టుకుంటుంది. అంటే కోటి రూపాయలన్నమాట.
అంకెలో పొరపాటా? లేకా.. తన అకౌంట్‌లో ఎవరైనా డ్రా చేసేశారో అనేది తేల్చాల్సి ఉందని చెన్నైలో ఓ ప్రవైట్ బ్యాంక్‌ను డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బ్యాంకు అధికారులు చాలా రహస్యంగా ఈ విచారణను చేపట్టినట్లు తెలిసింది.
ఇందులో బ్యాంక్ వారే చేతివాటం చూపించారామోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజం కాకపోతే.. త్రిషను నమ్మినవారే చేశారేమో అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఏదైతేనే త్రిష రూపాయి ఎటు పోయిందో త్వరలో బయటపడనుంది.
Post a Comment