కన్నడంలో సిల్క్ స్మిత జీవిత గాథ తెరకెక్కుతోంది. అదేవిధంగా మలయాళంలోనూ సిల్క్ స్మితకు సంబంధించిన సినిమా రూపొందుతోంది. ఇదే తరహాలో తమిళంలోనూ సిల్క్ స్మిత కథ ఆధారంగా సినిమా తీయాలని దర్శకులు, నిర్మాతలు కసరత్తు చేస్తున్నారు. ఈ సినిమాలో సిల్క్ స్మిత పాత్రధారిగా నటించాల్సిందిగా నయనతారను సంప్రదించారట.
గ్లామర్‌గా నటించాలి. రెండు కోట్ల రూపాయలను ఒకే పేమెంట్‌గా ఇచ్చేస్తామని నిర్మాతలు నయనతారతో చెప్పారట. అందుకు నయనతార మాత్రం నో చెప్పేసిందట. ఇందుకు ప్రధాన కారణం... నయనతార శ్రీరామరాజ్యంలో నటించిన సీత పాత్రే.
అసలు విషయమేమిటంటే.. సంప్రదాయమైన సీత పాత్రలో నటించిన తాను సిల్క్ పాత్రలో నటించలేనని నిర్మాతలకు నయన తేల్చి చెప్పేసింది. సీత పాత్రలో తాను నటిస్తున్నాను అనగానే ఎన్నో అడ్డంకులు, విమర్శలు ఎదురయ్యాయి. కానీ తర్వాత శ్రీరామరాజ్యం చిత్రంలో సీత పాత్రధారిగా తాను నటించినందుకు ఉత్తమ నటి అవార్డు గెలుచుకోవడమే కాకుండా.. సీత పాత్రలో నయనతార తప్ప మరేవరిని ఊహించుకోలేమని ప్రశంసలు కూడా పొందానని నయన చెప్పుకొచ్చింది.
అలాంటి గౌరవప్రదమైన సీత పాత్రలో కనిపించి.. గ్లామర్‌గా చిత్రసీమలో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న సిల్క్ స్మిత పాత్రలో చేయడం సబబు కాదని నయన నిర్మాతలకు చెప్పేసిందట. ఇంకేముంది..!? నయనతార రెండు కోట్ల రూపాయల బంపర్ ఆఫర్‌ను తిప్పి పంపేసిందనే చెప్పాలి.!

Share with Friends : |
Share with Friends : |
Post a Comment