హిందూ మతంలో తాళిబొట్టుకి చాలా విలువుంది. ఒకసారి కట్టినట్లయితే దాన్ని తీసేయడానికి మన సాంప్రదాయం ఒప్పుకోదు. ఈ సెంటిమెంట్ చాలా సినిమాల్లో ఎన్నో సన్నివేశాలలలో చూపించారు. విలన్ తాళి కట్టబో తుంటే అడ్డుకోవటం, లేదా పెళ్లికి అడ్డు పెట్టేవారు వస్తుంటే గబగబా తాళి కట్టేయడం లాంటి దృశ్యాలు ఎన్నో తెరకెక్కాయి. పురాణాల్లో కూడా పతివ్రతలను తాళి బొట్టు కాపాడిన ఉదంతాలు కనిపిస్తాయి. అయితే ఈ సెలబ్రిటీ పవిత్రత ఎంతో చూడండి… కొత్త ట్రెండ్, న్యూజనరేషన్ అంటూ హీరోయిన్లు, హీరోలు ఏం చేసినా చెల్లిపోతుందనే అహంభావం. స్టయిల్ పేరుతో సాంప్రదాయాలను తుంగలోకి తొక్కేసే సెలబ్రిటీలు ఆఖరుకి తాళిబొట్టులో కూడా స్టయిల్ చొప్పిస్తున్నారు. బాలీవుడ్ స్టయిల్ లేడీ శిల్పాశెట్టి తన మంగళ సూత్రాన్ని ఎక్కడ ధరించి వెళ్తున్నారో చూడండి. చేతికి బ్రేస్‌లెట్ లా మంగళసూత్రం వేసుకు తిరుగుతున్న శిల్ప ఇప్పటికే పలువురిని ప్రభావితం చేసింది. అసలు మంగళసూత్రం మెడలోనే ఎందుకు వేసుకుంటారనే దానిపై మన పెద్దలు చాలా సంగతులే చెప్పారు. కానీ శిల్ప మాత్రం అదేమీ పట్టనట్టు తాళిని తీసుకెళ్లిచేతికి కట్టుకుని తిరుగుతోంది. ఫ్యాషన్ వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో శిల్పని ఫాలో అవుతారా… సాంప్రదా యాల విలువలకు తలొగ్గుతారో చూడాల్సిందే.

Post a Comment