సోనా.. ఈ పేరు వింటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ గుర్తుకు వస్తారు. ఆమధ్య ఎస్పీ చరణ్ తనను బలవంతం చెయ్యబోయాడంటూ, క్షమాపణలు చెపితే ఒప్పుకుంటానని మొండికేసిన భామ సోనా. ఇప్పుడు సోనా సినీ ఇండస్ట్రీలోని డర్టీ కోణాలను చూపెట్టాలని అనుకుంటోందట.
ఇందులో భాగంగా తన జీవితకథనే ఆధారం చేసుకుని తనే నిర్మాతగా తమిళంలో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోందట. తన జీవితంలో తను ఎదుర్కొన్న చేదు అనుభవాలన్నిటినీ పూసగుచ్చినట్లు చూపిస్తానని చెపుతోందట.
సోనా ఇలాంటి ఆలోచనలో ఉన్నదని తెలియగానే ఇండస్ట్రీలోని కొందమంది భుజాలు తడుముకుంటున్నారట. తమ పేర్లను సోనా ఏవిధంగా సినిమాలో ఇరికించి చూపిస్తోందోనని బెంబేలు పడిపోతున్నారట.
Post a Comment