.
Home » » బాడిగార్డ్ ఆడియో రిలీజ్ డేట్

బాడిగార్డ్ ఆడియో రిలీజ్ డేట్

Written By Hot nd spicy on Thursday, 15 December 2011 | 10:22

అగ్రనిర్మాత బెల్లంకొండ సురేష్‌. పుట్టినరోజు నేడు ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో పాత్రికేయులతో ముచ్చటించారు. మరిన్ని సంగతులు మాట్లాడుతూ-‘‘ప్రతి ఏటా దేవనార్‌ ఫౌండేషన్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అలావాటు.
ఈ ఏడాది కూడా అక్కడి అంధ విద్యార్థుల మధ్య గడుపనున్నాను. బాలల కోసం సేవాకార్యక్రమాలు కూడా చేస్తున్నాం’’ అన్నారు. తదుపరి ప్రాజెక్టుల గురించి ముచ్చటిస్తూ-‘‘వెంకటేష్‌ హీరోగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ‘బాడీగార్డ్‌’ను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాం. అన్ని భాషల్లో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని వెంకటేష్‌ శరీరభాష, ఇమేజ్‌కు తగ్గట్టు మార్పు చేర్పులతో రూపొందిస్తున్నాం. ఈ నెల 13న హైదరాబాద్‌ శిల్పకళావేదికలో వెంకీ అభిమానుల సమక్షంలో పాటలు (థమన్‌ సంగీతం) విడుదల చేస్తున్నాం. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా రిలీజ్‌ చేస్తాం. సంక్రాంతికి వచ్చిన వెంకీ సినిమాలన్నీ హిట్లే. ఆ కోవలోనే ఇదీ చేరుతుంది’’ అన్నారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger