సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న చిత్రం సీతమ్మ వాకిట్లో సరిమల్లె చెట్టు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈచిత్రానికి సంబంధించిన కొన్ని డైలాగులు తాజాగా లీకయ్యాయి.
ఈ చిత్రంలో మహేష్ బాబు వెంకటేష్ తమ్ముడిగా నటిస్తున్నారు. సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో అన్నదమ్ముల మధ్య విబేధాలు వస్తాయి. ఈ క్రమంలో ఇద్దరు విడిపోతారు కూడా. ఈ సందర్భంగా మహేష్ బాబు ఈ కింది డైలాగులు చెప్పారట.
‘నేను కుటుంబాన్ని విడదీసే వాడినే అయితే ఈ కుటుంబంలో పుట్టే వాడినే కాదు'', ‘అమ్మ ఎంతో నాకు అన్నయ్య కూడా అంతే' అంటూ కుటుంబం, అన్నయ్యపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ మహేష్ బాబు డైలాగులు సాగుతాయి. ఈచిత్రంలో మహేష్ బాబు సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
సినిమా విడుదలకు ముందే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగి పోయాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్సే ఇందుకు నిదర్శనం. విడుదలైన తొలి రోజు ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ఏకంగా 2, 27,319 హిట్స్ సొంతం చేసుకోగా...ఫేస్ బుక్‌లో 9416 మంది షేర్ చేసుకున్నారు. ఈరేంజిలో రెస్పాన్స్ రావడంతో మహేష్ బాబు ఒక్కసారిగా షాకయ్యారు. ఆనందంతో ఉబ్బితబ్బయ్యారు. ‘ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది...నన్ను ఆదరిస్తున్న అందరికీ థాంక్స్..త్వరలోనే పండగ చేసుకుందాం' అంటూ తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ‘మై ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ ఫాదర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ తండ్రికి విషెస్ కూడా చెప్పారు.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment