సూపర్ స్టార్ రజనీకాంత్ 'కొచ్చడయ్యాన్' సినిమా మేకింగ్ విడుదలైంది. రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుగుతోంది. దీపావళి కానుకగా విడుదల కాబోతున్న కొచ్చడయ్యాన్ లో తమిళ, హిందీ నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'అవతార్'ను తలపించే విధంగా విజువల్ ఫీస్ట్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో నటించడం ఓ కొత్త అనుభూతిని కలిగిస్తోందని రజనీకాంత్ తెలిపారు.
ఈ చిత్రానికి సంబంధించిన వీడియో క్లిప్లింగ్స్ ను, చిత్ర యూనిట్ సభ్యులు లండన్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ యానిమేషన్ చిత్రాల్లో నటించడం ఇతర చిత్రాల్లో నటించినంత సులభం కాదని పేర్కొన్నారు. ఇప్పటివరకు వచ్చిన చిత్రాలకు పూర్తి భిన్నమయిన చిత్రం 'కొచ్చడయ్యాన్ అని ఆయన వెల్లడించారు. ఈ చిత్రం కోసం చిత్ర యూనిట్ మొత్తం శ్రమిస్తోందని తెలిపారు. ఊహకందని లొకేషన్స్ ఈ చిత్రంలో చోటు చేసుకుంటాయని రజనీ తెలిపారు.
రజనీకాంత్ సరసన ముంబయి భామ దీపిక పడుకునే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హిందీ నటుడు జాకీష్రాఫ్, శరత్ కుమార్, నాజర్, శోభన నటీనటులు నటిస్తున్నారు. సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో నగేష్, శ్రీకాంత్ దివంగత నటులను మళ్లీ మన కళ్ల ముందుకు తీసుకు రానున్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment