బాలకృష్ణ త్రిపాత్రాభినయంతో లక్ష్మీరాయ్, సలోని కథానాయికలుగా శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం 'అధినాయకుడు'. పరుచూరి మురళి దర్శకత్వంలో ఎం.ఎల్.కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కుమార్ చౌదరి మాట్లాడుతూ- బాలకృష్ణ మూడు పాత్రలతో అభిమానులకు నచ్చేవిధంగా నటించిన ఈ చిత్రంలో ఆయన పాత్ర సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో రూపొందించామని, అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చేలా ఈ చిత్రం నెల 12న విడుదల చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకూ కనిపించని కొత్త బాలయ్యను ఇందులో చూస్తారు. ఒక పాత్రకూ మరో పాత్రకూ పొంతన లేకుండా మూడు పాత్రలనూ అద్భుతంగా పోషించారు బాలకృష్ణ. ఇది తప్పకుండా జనం మెచ్చే సినిమా అవుతుంది అని చెప్పారు.
బాలయ్య నటన, యాక్షన్ ఎపిసోడ్స్, సెంటిమెంట్ సీన్స్, వినోదం, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తాయి. తాతగా, తండ్రిగా, కొడుకుగా మూడు వైవిధ్యమైన పాత్రల్లో బాలకృష్ణ గత చిత్రాలకంటే అద్భుతమైన నటనతో నటించారని దర్శకుడు మురళి తెలిపారు. జయసుధ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, వేణుమాధవ్, ఆదిత్య మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేందర్‌రెడ్డి, సంగీతం: కల్యాణి మాలిక్, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాత: ఎం.ఎల్.కుమార్ చౌదరి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పరుచూరి మురళి.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment