Home »
» టాలీవుడ్ టాప్ "బిజినెస్‌మేన్"గా అక్కినేని నాగార్జున
టాలీవుడ్ టాప్ "బిజినెస్‌మేన్"గా అక్కినేని నాగార్జున
నాగార్జున పెద్ద బిజినెస్‌మేన్ అని ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. రియల్ ఎస్టేట్ రంగం, టీవీల్లో భాగస్వామ్యం, హోటల్ వ్యాపారం, షేర్లు వంటి వాటిల్లో ఆయనకు ఎక్కువగా నాలెడ్జ్ ఉంది. అవన్నీ ఒక ఎత్తయితే... సినిమా అనేది కేవలం ఆహ్లాదం కోసం చేస్తున్నాడని అతని తెలిసిన వారు అంటుంటారు.మాదాపూర్‌లోని ఎన్ కన్వెక్షన్ సెంటర్ పెద్ద బిజినెస్ అడ్డాగా మారింది. ఇవి కాకుండా రిలయన్స్ సంస్థతో అవగాహన కుదుర్చుకుని అన్నపూర్ణ స్టూడియోలో పోస్టుప్రొడక్షన్స్ కార్యక్రమాలు సంబంధించి అన్ని వసతులతో నిర్మించాడు. ఇదికాక జూబ్లీహిల్స్‌లో అధునాతన రీతిలో చైనీస్ రెస్టారెంట్‌కు సన్నాహాలు చేస్తున్నాడు. దీనికోసం రూ. 5 కోట్లు పెట్టాడని సమాచారం. ఆ హోటల్‌కు ఇంటీరియర్ డెకరేషన్ దగ్గరుండి నిర్వహిస్తున్నాడట. ఇలా అన్ని రంగాల్లో నిష్ణాతుడైన వ్యక్తి నాగ్ అని చెప్పుకుంటున్నారు.
Post a Comment