మార్చి 9 నుంచి 26 వరకు అంటే కేవలం 17 రోజుల్లోనే రూ. 43 కోట్లను వసూలు చేసి, బంపర్‌హిట్‌గా నిలిచింది విద్యా బాలన్ తాజా చిత్రం 'కహానీ'. ఆమె తాజా చిత్రం 'కహానీ' బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. కేవలం 8 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. క్రితం సంవత్సరం వచ్చిన 'ద డర్టీ పిక్చర్'తో సూపర్‌హిట్ సాధించి, ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా రూ. వంద కోట్ల మార్కును సాధించడమేమిటని అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేసిన విద్యాబాలన్ తాజాగా మరో సూపర్‌హిట్ కొట్టడం అందరి హీరోలను ఆశ్చర్యంలో ముంచేసింది.
ఇది కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమే కావడం విశేషం. అందులోనూ డర్టి పిక్చర్... సినిమా విద్య స్కిన్ షో కారణంగానే హిట్టయ్యిందనే విమర్శకులకు సైతం 'కహానీ' గట్టి సమాధానమిచ్చింది. ఇందులో ఆమె గర్భవతిగా డీ గ్లామర్డ్ కేరక్టర్‌ను చేసింది. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బంపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో విద్య నటనకు ఫిదా అయిన అమీర్‌ఖాన్ ఆమెతో కలిసి నటించాలనే కోరిక వ్యక్తం చేయడం ఆమె ప్రతిభకు లభించిన మరో గుర్తింపు గా ఆమె చెప్తోంది.
Post a Comment