ఇటీవలి కాలంలో ఓ పేరుపొందిన హీరో సినిమా ఇంతకాలం సెట్స్ మీద ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఆ సినిమా ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'రెబల్'. రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా 2010 డిసెంబరులో లాంఛనంగా మొదలవగా, 2011 జనవరిలో సెట్స్ మీదకెళ్లింది. అంటే 2012 జనవరికే సంవత్సరం అయిపోయింది. 2012 మార్చి అయిపోయినా ఇంకా షూటింగ్ పూర్తికాలేదు. ఏప్రిల్ నెలాఖరుకు గానీ షూటింగ్ పూర్తవదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పట్నించీ అంతా అనుకున్నట్లు జరిగితే జూన్ 2012లో సినిమా రిలీజయ్యే అవకాశాలున్నాయి.
ప్రభాస్ మునుపటి సినిమా 'మిస్టర్ పర్ఫెక్ట్' 2011 ఏప్రిల్లో రిలీజైంది. అలాగే 'డార్లింగ్' 2010 ఏప్రిల్లో వచ్చింది. అంటే ఆ రెంటి మధ్య సరిగ్గా సంవత్సరం గ్యాప్ ఉంది. ఈసారి దానికంటే ఎక్కువ గ్యాప్ రావడం గమనార్హం. లారెన్స్ పనితీరు వల్లే ఈ సినిమా షూటింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతున్నదనేది ఈ సినిమాతో అనుబంధం వున్నవాళ్ల మాట. ప్రభాస్ కూడా లారెన్స్ పనితీరు పట్ల బాగా అసంతృప్తితో ఉన్నాడని వాళ్లంటున్నారు. మరోసారి అతనితో పని చేసేది లేదని తన సన్నిహితుల వద్ద ప్రభాస్ మనసులో మాట చెప్పినట్లు వినిపిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నాయికలుగా తమన్నా, దీక్షా సేథ్ నటిస్తున్నారు.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment