నా ప్రతి పాత్రా గత పాత్రలకు భిన్నంగా ఉండాలని కోరుకుంటాను" అంటోంది అందాల తార తాప్సీ. కృష్ణవంశీ డైరెక్షన్‌లో చేసిన 'మొగుడు' సినిమా ఫ్లాపయినా, అందులో ఆమె నటనకు ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ఆమె మూడు ప్రతిష్ఠాత్మక సినిమాల్లో నటిస్తోంది. అవి - 'గుండెల్లో గోదావరి', 'దరువు', 'షాడో'. అంటే పాత్రల ఎంపికలో ఆమె చాలా జాగ్రత్తలే తీసుకుంటోంది.
ఒకే రకమైన పాత్రలతో ప్రేక్షకుల్ని విసిగించడం నాకిష్టం ఉండదు. అందుకే ఒక పాత్రకీ, మరో పాత్రకీ వైవిధ్యం కొరుకుంటా. దేవుడి దయవల్ల నా వద్దకు వస్తున్న పాత్రలు కూడా అలాగే ఉంటున్నాయి. మంచి స్క్రిప్టులే వస్తున్నాయి అని తెలిపింది ఈ ఢిల్లీ డాల్.కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని విషయం ఒకటుందని అంటూ ఆయన హీరోయిన్లందరిలోకీ నేను అందగత్తెనని 'ఝుమ్మంది నాదం' సినిమా సమయంలో కె. రాఘవేంద్రరావు గారు అన్న మాటలు ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పింది తాప్సీ.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment