పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్' చిత్రం రికార్డుల మీద రికార్డుల సృష్టిస్తూ దూసుకెలుతూనే ఉంది. గబ్బర్ సింగ్ చిత్రంలో అలీ చెప్పినట్లుగా....పాటొచ్చి పదేళ్లయినా పవరింకా తగ్గలేదు అన్నట్లుగానే....గబ్బర్ సింగ్ నాలుగు వారాలైనా బాక్సాఫీసులో తన జోరు కొనసాగిస్తూనే ఉన్నాడు.
తాజాగా ఈచిత్రం నైజాంలో నయా రికార్డును నెలకొల్పింది. ఈ చిత్రం ఇప్పటి వరకు ఇక్కడ దాదాపుగా రూ. 20 కోట్ల గ్రాస్, రూ. 17 కోట్ల షేర్‌తో మగధీర రికార్డుకు చేరువైంది. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం నెం.1గా ఉన్న మగధీర రికార్డును తుడిచి పెట్టడం ఖాయం అనిఅంటున్నారు.
ఒక్ర ప్రసాద్ ఐమాక్స్ థియేటర్లోనే గబ్బర్ సింగ్ చిత్రం 24 రోజుల్లో దాదాపుగా రూ. 2 కోట్ల గ్రాస్ కలెక్షన్ల సాధించిందట. పవర్ స్టార్ బాక్సాఫీసు స్టామినా ఏమిటో ఈ చిత్రాన్ని బట్టి తెలుస్తోంది. గతంలో ‘ఖుషి' చిత్రంతో పవర్ స్టార్ బాక్సాఫీసును ఓ ఊపు ఊపాడు. మళ్లీ 11 ఏళ్ల తర్వాత పవర్ స్టార్ పవర్ బయట పడింది.
ఈ చిత్రానికి సంబంధించిన హెక్సా ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహించనున్నారు. సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్స్ అంతా హాజరు కానున్నారు. ‘గబ్బర్ సింగ్' విజయంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని షీల్డ్‌తో సత్కరించనున్నారు. ఈ మేరకు ప్రత్యేకగా షీల్డ్ డిజైన్ చేయించారు. హెక్సా ప్లాటినమ్ డిస్క్ వేడుకకు కూడా పవన్ దూరంగానే ఉండాలని నిర్ణయించుకున్నా....నిర్మాత బండ్ల గణేష్ పవర్ స్టార్‌ని కన్విన్స్ చేశాడని సమాచారం. పవర్ స్టార్ వస్తాడని తెలియడంతో ఆ వేడుక ఎప్పుడు జరుగుతుందా...తమ అభిమాన హీరోను ప్రత్యక్షంగా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆస్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన గబ్బర్ సింగ్ చిత్రానికి ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్
Share with Friends : |
Share with Friends : |
Post a Comment