.
Home » , » 'కెమెరామేన్ గంగతో..'పై రూమర్ నిజమేనా?

'కెమెరామేన్ గంగతో..'పై రూమర్ నిజమేనా?

Written By Hot nd spicy on Tuesday, 21 August 2012 | 11:35


pawan
హైదరాబాద్: పవన్‌ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. ఈ చిత్రంపై పూరీ జగన్నాధ్ తాజా చిత్రం దేముడు చేసిన మనుష్యులు ఎఫెక్టు పడనుందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా బిజినెస్ పై గ్యారెంటీగా ఈ ప్రభావం ఉంటుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అయితే పూరి ఈ సినిమాని అన్ని జాగ్రత్తలు తీసుకుని చేస్తున్నాడని,బిజినెస్ మ్యాన్ లా హిట్ అయ్యే అవకాసం ఉందని కొందరంటున్నారు. పవన్ మాత్రం కూల్ గా ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నట్లు చెప్తున్నారు.
'గబ్బర్‌ సింగ్‌' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ 'కెమెరామేన్‌ గంగతో రాంబాబు' చిత్రాన్ని కమర్షియల్‌ సినిమాగా బిగ్గెస్ట్‌ హిట్‌ అయ్యేలా చేసే గ్యారెంటీ తనదని పూరి చెబుతున్నాడు. ఈ సినిమా విడుదలకు ముందే రూ.50 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. నైజాం, రాయలసీమ, సీడెడ్ ఇలా అన్ని చోట్లా పోటీ నెలకొంది. ఈ సినిమా నైజాం హక్కులు నిర్మాత అల్లు అరవింద్ తీసుకున్నట్లు సమాచరం. తూర్పుగోదావరి జిల్లా వరకు ఆర్ఆర్ ఫిలింస్ రూ.2.50 కోట్లు అఫర్ చేసినట్లు సమాచారం.
అలాగే ఈ చిత్రం మొదటి టీజర్ ని చిరంజీవి పుట్టిన రోజున విడుదల చేయటానికి నిర్ణయంచారని సమాచారం. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న ఈ టీజర్ అభిమానులు మధ్య విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోలో పుట్టిన రోజు వేడుకలు,టీజర్ విడుదల జరగనుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. నాలుగు నెలల్లో ఈ చిత్రం షూటింగ్ ని పూర్తి చేయాలని పూరీ జగన్నాధ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు గర్వపడుతున్నానని పవన్‌ కామెంట్‌ చేసినట్టు చెబుతున్నారు.ఆ కామెంట్‌తో ఉబ్బితబ్బిబ్బయిన పూరి జగన్నాథ్‌కు అసలు నిద్ర పట్టడం లేదని అంటున్నారు. ఇక ఈ చిత్రం బిజినెస్ కూడా మంచి క్రేజ్ తో మొదలైంది.

పవన్ కళ్యాణ్ వేల మంది జనాల్ని కలసే సీన్స్ కూడా ఇక్కడే షూటింగ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజు పవన్ ఫ్యాన్స్ ని పిలిచి ఆ సీన్స్ షూట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొన్న ఓ రోజు అనుకున్నారు కానీ వర్షం రావటంతో కుదరలేదు. ఇక పవన్ కళ్యాణ్ సరసన తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం మీడియాపై పూర్తి స్ధాయి సెటైర్ గా ఉండబోతోందని చెప్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మెకానిక్ గా కనిపించనున్నారు. అనుకోని పరిస్ధితుల్లో పవన్ మీడియాలోకి రావటం హైలెట్ కానుంది.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్, శేఖర్, ఫైట్స్: విజయ్, స్టిల్స్: మాగంటి సాయి, కో డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, నిర్మాణం యూనివర్సల్ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డివివి దానయ్య, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger