హైదరాబాద్: అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం జులాయి. ఈ చిత్రం నిన్న గురువారం విడుదలైంది. ఈ చిత్రం ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి చూసి ఆయన స్పందనను తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఆ ట్వీట్ లో...హిలేరియస్..కామెడీ ఫిల్మ్..నేను జులాయి సినిమా మొత్తం బాగా ఎంజాయ్ చేసాను. కంగ్రాట్యులేషన్ త్రివిక్రమ్ గారూ,బన్నీ,నిర్మాతలు..ఇలాంటి సూపర్ హిట్ ఇచ్చినందుకు అని ట్వీట్ చేసారు.
అల్లు అర్జున్,ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. ఈ చిత్రం రిలీజైన మార్నింగ్ షో కే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం ఎలా ఉన్నా త్రివిక్రమ్ మార్కు సెంటిమెంట్,ఫన్ డైలాగులతో కొట్టుకొస్తుందని ఆశించారు. హ్యాపీ,ఆర్య సినిమాలలో చేసిన క్యారెక్టర్ తరహాదే ఈ చిత్రంలో అల్లు అర్జున్ పోషించిన రవి పాత్ర అని చెప్పుకొచ్చారు.
అయితే తెరపై అంత సీన్ ప్రేక్షకుడుకి కనపడలేదు. ముఖ్యంగా బి,సి సెంటర్ల ప్రేక్షకులు చాలా నిరాసకు గురి అయ్యేలా కథ,కథనం తీర్చిదిద్దారు.అయితే అల్లు అర్జున్ తనదైన శైలిలో కొత్తగా ప్రయత్నించి మార్కులు కొట్టేసాడు . స్టైలిష్ స్టార్ అన్నపదానికి న్యాయం చేసే విధంగా డాన్స్ లు,ఫైట్స్ ఇరగతీసాడు.
అలాగే ఇలియానా.. మధు పాత్రలో జల్సా మ్యాజిక్ ని రిపీట్ చేయటానికి ప్రయత్నించి విఫలమైంది. అదే గెటప్ లో దిగినా మరీ బక్క పలుచరి ఆమె రూపం తెరపై గ్లామర్ ని పంచలేకపోయింది.. రాజేంద్రప్రసాద్ నటనకూడా సినిమాకు ప్లస్ అవుతుందని భావించారు.
అయితే ఆ సీన్స్ కేవలం బఫూనరి కామెడీకే పరిమితమయ్యాయి . అయితే ఖలేజాతో నిరాసపరిచిన త్రివిక్రమ్ ఈ సినిమాతో డైలాగులు విషయంలో ఫుల్ మీల్స్ తినిపించాడని అన్నారు. టెక్నికల్ గా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా ఎప్పటిలాగే త్రివిక్రమ్ మార్క్ వన్ లైనర్స్,పంచ్ డైలాగులు పేలాయి. కెమెరా వర్క్ హైలెట్ గా నిలుస్తుంది.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment