మణిరత్నం అంటే డైరెక్టర్‌గా చక్కటి ప్లానింగ్‌లో ఉంటాడని అందరికీ తెలిసిందే. కానీ ఒక్కోసారి పప్పులో కాలేస్తుంటారు. ఎందుకంటే.. రావణ్ తర్వాత గ్యాప్ తీసుకుని మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న తమిళ చిత్రం 'కడల్'. ఈ చిత్రంలో అక్కడి హీరో కార్తీక్ కొడుకు గౌతమ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. హీరోయిన్‌గా సమంతాను బుక్ చేశారు. చేయడమే కాదు కొంత భాగం షూట్ చేశారు.
ఆ తర్వాత తెలిసిందేమంటే... హీరో కంటే హీరోయిన్ పెద్దదిగా ఉందనే విషయం. గౌతమ్ పక్కన 14 ఏళ్ల అమ్మాయి కావాలని నిర్ణయించుకున్నాడట. దాంతో ఆమెను తప్పించారని తెలిసింది. దీంతో బాధ పడకపోయినా.. మళ్ళీ ఆయనతో అవకాశం వస్తుందని సమంతా చెప్పడం ఆమె ధైర్యం మెచ్చుకోదగింది.
Post a Comment