కమల్ హాసన్ కూతురు కదా.. ఏది చేసినా... దానికి కరెక్ట్‌గా సమాధానం చెబుతుంది. గబ్బర్ సింగ్‌కు ముందు మీరు సరైన సక్సెస్‌లో లేరంటే... ఎవరన్నారు... నేను చేసిన సినిమాలన్నీ ఫెయిల్ కాలేదు. బాగానే ఆడాయి. నా నటన బాగానే ఉందన్నారు. ఏదో కొంతమంది అంటే సరిపోతుందా అంటూ.. ఇటీవలే గబ్బర్ సింగ్ సక్సెస్ సందర్భంగా హైదరాబాద్ వచ్చినప్పుడు వెల్లడించింది.
ఈ ఊపులో పలు షోరూమ్‌లు కూడా ప్రారంబోత్సవాలు చేసేసింది. లేటెస్ట్‌గా... బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చాయి. అక్కడ బిజో నంబియార్ అనే దర్శకుడు చేస్తున్న 'రష్' అనే టీవీ షోలో పాల్గొంది. కాలేజీ ఫెస్టివల్‌లో రెండు రోజులపాటు 12 మంది స్టూడెంట్స్‌ను వారు ఎలా గడుపుతారన్నది అనే కాన్సెప్ట్ అది.
ఈ సందర్భంగా కంపోజ్ చేసిన పాటకు డాన్స్ కూడా చేసింది. అయితే... కెరీర్ బాగున్న టైమ్‌లో టీవీ షో చేయడం కారణమేమిటని అక్కడి విలేకరి అడిగితే.... రష్ కార్యక్రమం సినిమాలా తీశాడు దర్శకుడు. అయినా.. టీవీ మీడియా తక్కువేం కాదు. చాలా పవర్‌ఫుల్ అంటూ సమాధానమిచ్చింది.
Post a Comment