కమల్‌హాసన్ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'విశ్వరూపం'. ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, పి.వి.పి. సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆగస్టు 24 న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు విడుదల తేదీని ఖరారు చేసినట్లు సమాచారం. హాలీవుడ్ సాంకేతిక నిపుణుల సహకారంతో అమెరికాలో నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తి చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పాటల్ని విడుదల చేస్తారు.
ఈ చిత్రం గురించి కమల్‌హాసన్ మాట్లాడుతూ ''నా కెరీర్‌లోనే భారీ వ్యయంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇదేదో సూపర్ హీరో సినిమా కాదు. జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన కథాంశమిది. ఈ సినిమాకి కొనసాగింపుగా 'విశ్వరూపం 2' కూడా రూపొందిస్తాను. ఇందుకు సంబంధించిన ఆలోచనలు నా మదిలో ఉన్నాయి. త్వరలోనే వాటికి రూపం ఇవ్వాలనుకొంటున్నాను. 'విశ్వరూపం' కథకు కొనసాగింపు తీయదగ్గ లక్షణాలున్నాయి. ఇప్పటికే సీక్వెల్ తీశాననీ, మొదటి భాగంలో ఎక్కువ తీశాననీ వార్తలొస్తున్నాయి. అవి సత్యదూరం'' అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకీ తీవ్రవాద కార్యకలాపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనాన్ని చర్చిస్తూనే... వారి పని తీరుని, ఆలోచనల్నీ తన చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. తీవ్రవాదం గురించి కమల్ చిత్రంలో ఏం చర్చించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. తెరపై ఆయన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా విడుదల చేసి కమల్ అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ చిత్రం కోసం ఆయన ప్రత్యేకంగా పండిట్ బిర్జూ మహారాజ్ దగ్గర కథక్ నృత్యం నేర్చుకొన్నారు. కథలో ఆ నృత్యం కీలకమని సమాచారం. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో ఇది తెరకెక్కింది. ప్రముఖ దర్శకులు శేఖర్ కపూర్ ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించారు. కథలో ఆ పాత్ర కీలకమై సినిమాను మలుపు తిప్పుతుందని చెప్తున్నారు. శంకర్-ఎహసాన్-లాయ్ స్వరాలు సమకూర్చారు. పూజా కుమార్, రాహుల్ బోస్, ఆండ్రియా, జైదీప్ అహ్లావత్ తదితరులు నటించారు. సంగీతం: శంకర్-ఎహసాన్-లాయ్, నిర్మాతలు: ప్రసాద్ వి.పొట్లూరి, చంద్రహాసన్, కమల్‌హాసన్.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment