‘డర్టీ పిక్చర్', ‘కహానీ' లాంటి విజయవంతమైన చిత్రాలతో మంచి జోరుమీదున్న బాలీవుడ్ భామ విద్యా బాలన్ త్వరలో మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘షాదీ కి సైడ్ ఎఫెక్ట్స్' అనే టైటిల్‌తో రూపొందబోయే ఈచిత్రంలో పెళ్లి తర్వాత జరిగే పరిణామాలు, కష్టాలు చూపించబోతున్నారు.
2006లో వచ్చిన ‘ప్యార్ కి సైడ్ ఎఫెక్ట్స్' చిత్రానికి సీక్వెల్‌గా ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ చిత్రంలో మల్లికా షెరావత్, రాహుల్ బోస్‌లు కలిసి నటించగా...ఈ చిత్రంలో విద్యా బాలన్, ఫరాన్ అక్తర్ జంటగా కనిపించ బోతున్నారు. రొమాంటిక్, కామెడీ అంశాలతో ఈచిత్రాన్ని రూపొందించనున్నారు.
ప్రస్తుత జనరేషన్‌లో పెళ్లి తర్వాత చోటు చేసుకుంటున్న అంశాలను వినోదాత్మక కోణంలో చూపించడంతో పాటు...ఓ మెసేజ్ ఫుల్ చిత్రంగా దీన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విద్యా బాలన్ ఢిల్లీ గర్ల్‌గా, ఫరాన్ అక్తర్ బాంబే బాయ్‌గా కనిపించబోతున్నారు. ప్రీతిష్ నంది కమ్యూనికేషన్స్ పతాకంపై నిర్మాత ప్రీతీష్ నంది నిర్మిస్తున్న ఈచిత్రానికి సాకేత్ చౌదరి దర్శకత్వం వహించనున్నారు.
ఇక విద్యా బాలన్ వ్యక్తిగత విషయాలకు వస్తే...విద్యా బాలన్ గత కొంత కాలంగా యూటివీ హెడ్ సిద్దార్థ రాయ్ కపూర్‌తో సంబంధం నడుపుతోందని, ఇద్దరు ఎప్పుడో హద్దులు దాటారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని విద్యా బాలన్ స్వయంగా ఒప్పేసుకుంది. మీడియాతో మాట్లాడుతూ....సిద్ధార్థ రాయ్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్న మాట నిజమే, కానీ పెళ్లి గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment