బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత హౌస్ వైఫ్ గా సెటిలైన శ్రీదేవి ఇంతకాలం తన ఇద్దరు కూతుర్ల బాగోగులు చూసుకుంటూ గడిపేసింది. అలా అని అందాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పటికీ సన్నటి తీగలా నవనవలాడుతోంది. ఇన్నాళ్లుకు అభిమానుల కోరిక మేరకు రీ ఎంట్ర ఇస్తోంది శ్రీదేవి. 'ఇంగ్లిష్ వింగ్లిష్" అనే హిందీ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది.
ఈ సినిమాలో మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ గా నటిస్తోన్న శ్రీదేవి...అమెరికాలో బట్లర్ ఇంగ్లిష్ (ఇంగ్లీష్ సరిగా మాట్లాడటం రాని) మాట్లాడే మహిళగా నటిస్తోంది. దీంతో అంతా ఆమె బాషను చూసి నవ్వుతుంటారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఈ సినిమాలో అష్ట కష్టాలు పడుతుంట శ్రీదేవి. ఈ సినిమాకు గౌరీ షిండే దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదల చేశారు. శ్రీదేవి సినిమాలు మానేసి చాలా సంవత్సరాలే అయినా ఇప్పటికీ శ్రీదేవి అంటే పడి చచ్చేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
అయితే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చాలా మంది హీరోయిన్ల ఫెయిల్ అయిన అవకాశాలే ఎక్కువ. ఒకప్పుడు నెం.1 స్థానంలో ఉన్న మాధురి దీక్షిత్ ఆ మధ్య ఓ బాలీవుడ్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చినా ప్రేక్షకాదరణ దక్కలేదు. ఈనేపథ్యంలో శ్రీదేవి రీ ఎంట్రీ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment