హైదరాబాద్ : సుమంత్, జెనీలియా జంటగా సూర్యకిరణ్ దర్శకత్వంలో వచ్చిన ‘సత్యం'అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతుంది. అయితే ఈసారి తనీష్ హీరోగా ఈ సినిమాకి కొనసాగింపును తెరకెక్కిస్తున్నారు సూర్యకిరణ్. విజయదశమి రోజున ‘సత్యం-2' ప్రారంభోత్స వం జరగనుంది.
సూర్యకిరణ్ చెబుతూ -‘‘ఒక్క తల్లి ప్రేమ తప్ప మిగతా అన్నీ కల్తీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిజమైన ప్రేమ ఉందా? శారీరిక ఆకర్షణనే ప్రేమ అనుకుంటున్నారా? అనే అంశాన్ని ఈ చిత్రంలో చర్చించబోతున్నాం. ‘మేం వయసుకు వచ్చాం' సినిమా చూసి, ఈ చిత్రానికి తనీష్ హీరో అయితే బాగుంటుందనుకున్నాను. తనీష్ ఈ కథ విని, చేయడానికి అంగీకరించాడు. విజయదశమి నాడు ఈ చిత్రాన్ని ఆరంభిస్తాం. ప్రారంభోత్సవాన్ని నిరాడంబరంగా చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆరోజు 15, 20 మంది స్టూడెంట్స్‌కి ఒక సంవత్సరానికి అయ్యే స్కూల్ ఫీజుని మా ట్రస్ట్ ద్వారా ఇవ్వబోతున్నాం. ఈ చిత్రం అనుకున్నప్పటి నుంచీ మాకన్నీ పాజిటివ్‌గా కుదురుతున్నాయి. ఆ పాజిటివ్ ఫీల్‌తో మంచి సినిమా అందించడానికి మేమంతా కృషి చేస్తున్నాం'' అని చెప్పారు.
అలాగే..‘‘ఫ్రెష్‌నెస్ ఉన్న కథతో తీస్తున్నాం. అసలు నిజమైన ప్రేమ ఉందా? కేవలం ఆకర్షణ మాత్రమేనా? పెళ్లయ్యాక ప్రేమలో తేడా ఎందుకు వస్తోంది? అమ్మ ప్రేమ తప్ప మిగిలినవన్నీ అసత్యాలేనా? అనే కోణంలో సాగే కథాంశాన్ని సిద్ధం చేశాను.స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉండాలో చూపిస్తున్నాం. రామ్ ప్రియాంక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపెై ఎస్.వి.బి.ప్రసాద్‌శర్మ సమర్పణలో ఈడ్పుగంటి శేషగిరి నిర్మాతగా తెరకెక్కనుంది. అక్టోబర్ 24(దసరాకి)న ప్రారంభిస్తున్నాం'' అన్నారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొందరు పేదవిద్యార్థులకు ఈ చిత్రం ప్రారంభోత్సవం రోజున ఆర్థిక సాయం చేయనున్నాం.. అని అన్నారు.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment