బాలకృష్ణ, రాజమౌళి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్నట్లు, బాలయ్య వందవ చిత్రం డైరక్ట్ చేయటానికి రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, రెండు దఫాలుగా చర్చలు జరిగాయని, శ్రీరామ రాజ్యం నిర్మాత యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు....వెలువడ్డ వార్తలను దర్శకుడు రాజమౌళి ఖండించారు. బాలయకృష్ణ 100వ చిత్రానికి తాను దర్శకత్వం వహిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం తప్పుడు ప్రచారం అని తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు.
‘News about me doing balakrishna garu's 100th film is false..' అంటూ ఆయన తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఈ పుకార్లు వినిపించడం వెనక చాలా కారణాలే ఉన్నాయి. ఎలాంటి చిత్రాలనైనా రాజమౌళి హ్యాండిల్ చేయగలడు. త్వరలో బాలకృష్ణ రాజకీయ తెరంగ్రేటం చేయనున్న నేపథ్యంలో 100వ చిత్రానికి అపజయం ఎరుగని రాజమౌళికి అయితేనే ఫర్ ఫెక్ట్ అని చాలా మంది భావన. పైగా బాలయ్య కుటుంబానికి చెందిన స్టూడియోపై ‘ఎన్టీఆర్' అనే టైటిల్ రిజిస్టర్ కావడం, ‘న్యాయానికి త్యాగానికి రారాజు' అనే సబ్ టైటిల్ పేరు వినిపిస్తుండటంతో...అంతా నిజమే అని నమ్మారు. అయితే ఎట్టకేలకు రాజమౌళి క్లారిటీ ఇవ్వడంతో అనుమానాలు తీరినట్లయింది.
ప్రస్తుతం బాలకృష్ణ ‘శ్రీమన్నారాయణ'చిత్రంలో చేస్తున్నారు. రవి చావలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో పార్వతి మెల్టన్, ఇషా చావ్లా కథానాయికలు. సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలపై ఓ జర్నలిస్ట్ గావించిన పోరాటమే ఇతివృత్తంగా దీన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Share with Friends : |
Share with Friends : |
Post a Comment