పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన సినిమా 'బిజినెస్‌మేన్'. ఈ చిత్రానికి ముందు దర్శకుడు కాంబినేషన్ 'పోకిరి'. ఈ గ్యాప్‌లో మహేష్‌బాబులో చాలా మార్పులు వచ్చాయంటున్న పూరీ జగన్నాథ్‌తో వెబ్‌దునియా ఇంటర్వ్యూ వివరాలు...
బిజినెస్‌మేన్ సినిమా చాలా స్పీడ్‌గా జరిగినట్లుగా ఉంది?
అంటే ..మిగతా సినిమాలు చాలా లేట్ అనా? అటువంటిది ఏమీలేదు. సినిమా చేసేటప్పుడు ముందుగా ప్లాన్ వేసుకుని దాన్ని కరెక్ట్ టైమ్‌కు తేవాలనుకుంటాం. మాకంటే చిత్ర నిర్మాత వెంకట్ పర్‌ఫెక్ట్ ప్లానింగ్ బాగా ఉపయోగింది. షూటింగ్ మూడున్నర నెలల్లో పూర్తయింది. మహేష్‌బాబు 65 రోజులు వర్క్ చేశారు. యూనిట్ అంతా చాలా హ్యాపీగా ఉన్నాం.
సినిమా విడుదల డేట్ మార్చడానికి కారణం?
ముందుగా ఈ సినిమాను ఈనెల 11న విడుదల చేయాలనుకున్నాం. కానీ అమెరికాలో వీకెండ్ డేస్‌లో సినిమాలు చూస్తారు. అక్కడ 11న థియేటర్లు ప్రాబ్లమ్స్‌గా ఉన్నాయి. అందుకే 13న విడుదల చేయడానికి ప్లాన్ చేశాం.
మొత్తం ఎన్ని థియేటర్లు?
ప్రపంచవ్యాప్తంగా 1600 థియేటర్లుపైగా ఉన్నాయి. ఇదంతా నిర్మాత చాలా ప్లాన్‌గా చూసుకుంటున్నారు. శనివారం నుంచి అడ్వాన్స్ బుకింగ్ ఉంటుంది.
బిజినెస్‌మేన్ నిర్మాతా? మీరా? మహేష్‌బాబా?
మీరు కథంతా చెప్పమంటే కష్టం.. చిన్నపాయింట్.. ఇదేదే గొప్ప కథ అని చెప్పను.
ముంబైను ఉచ్చపోయిస్తాను- అనే డైలాగ్ కాంట్రవర్సీ కాదా?
ఇంతవరకు అవ్వలేదు. ముంబైకు వచ్చి 'భాయ్' అవ్వాలనుకునే వ్యక్తి కథ. ఆ సందర్భంలో డైలాగ్ అలా వచ్చింది. అది సినిమాలో వినడానికి బాగుంటుంది.
ఇటువంటి కథలతో అమితాబ్ సినిమాలు వచ్చాయి కదా?
అమితాబ్ 'డాన్', కమల్‌హాసన్ 'నాయకుడు' వంటి కథలు చాలా ఉన్నాయి. ఒక్కో సినిమాకు ఒక్కో కథ ఉంటుంది. ఎవరి కథ వారిదే. ఏ సినిమాకూ ఆ సినిమా పోలికే లేదు.
కాజల్‌తో లిప్‌లాక్ పెట్టించారు. మహేష్ బాబు చెప్పినప్పుడు ఏమన్నారు?
లిప్‌లాక్... కాజలే ముచ్చటపడి మహేష్‌ను ముద్దుపెట్టుకుంటుంది. మహేష్‌బాబు ఏమంటాడు.. ముద్దుపెట్టుకుంటానంటే.. సరే అన్నాడు. అదికూడా సీన్‌లో భాగమే. ఆ సీన్‌ను నమ్రతకు చూపించాను. చాలా ఎంజాయ్ చేసింది.
పాటల రెస్సాన్స్ ఎలా ఉంది?
థమన్ ఇచ్చిన సంగీతం సూపర్బ్... చాలాచోట్ల 'సార్ వస్తారా..' అనే పాటను వింటూఎంజాయ్ చేసినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. కొన్నిచోట్ల ఆ పాటనే చాలాసార్లు యూత్ వింటున్నారు.
సినిమాలోని ఓ పాటను వేరే లాంగ్వేజ్ నుంచి తీసుకున్నట్లు తెలిసింది?
(కాస్త.. వాయిస్ పెంచుతూ..) అందులో తప్పులేదు. నా చిత్రాల్లో ఎన్నో పాటలు, సన్నివేశాలు ఇతర సినిమాల్లోనివే. అసలు మనం తీసే కెమెరా మనదికాదు. అది విదేశాలదే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి.
ఒకవేళ మహేష్ బాబు ఒప్పుకోకుంటే ఈ సినిమాకు ఎవరైతే బాగుంటుందనుకుంటున్నారు?
మహేష్‌బాబుతో కాక మరో హీరోతో ఈ సినిమా చూడలేం. ఊహించలేం. అసలు మహేష్ బాబు ఈ సినిమాకు యాప్ట్.
పోకిరి టు బిజినెస్‌మేన్.. ఐదేళ్ళ గ్యాప్‌లో మహేష్‌లో మీరు గ్రహించిన అంశాలు?
అప్పటికి ఇప్పటికి మహేష్‌బాబులో కొన్ని మార్పులు వచ్చాయి. వాయిస్ మారింది. పెర్‌ఫార్మెన్స్ బాగా పెరిగింది. నాన్నగారిలా నిర్మాతల మనిషిగా ఎదిగాడు.
మూడు భాషల్లోనూ ఒకేసారి విడుదల చేస్తున్నారా?
లేదు. తమిళం, మలయాళంలో అక్కడి హీరోల సినిమాలు పండక్కి ఉన్నాయి. దానివల్ల థియేటర్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 15రోజుల గ్యాప్ తర్వాత అక్కడ రిలీజ్ అవుతుంది.
సినిమాలో గీతరచయితగా సింగిల్ కార్డ్ వేయడానికి కారణం?
ప్రతి సినిమాలో ఒక్కోపాట ఒక్కోలా ఉండాలని నలుగురు, ఐదుగురితో పాటలు రాయిస్తున్న ఇప్పటి ట్రెండ్‌లో నాకూ, భాస్కరభట్ల రవికి మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. ఏదైనా చెప్పగానే దానికి తగినట్లుగానే లిరిక్ రాసేస్తాడు. 'సార్ వస్తారా' అనే పాటను కూడా రాయడానికి షూటింగ్‌లో పాల్గొన్నాడు. అక్కడ మూడ్‌ను బట్టి వెంటనే రాసేశాడు.. అంటూ ముగించారు.

Post a Comment