పవర్ స్టార్ పనన్ కళ్యాణ్ హారిష్ శంకర్ దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ షూటింగ్ విశేషాల గురించి దర్శకుడు వివరిస్తూ....పవర్ స్టార్ తో పాటు, యూనిట్ సభ్యులంతా యాక్షన్ సన్నివేశాలను ఎంజాయ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న యాక్షన్ సన్నివేశాలకు యూనిట్ సభ్యుల నుంచి క్లాప్స్ క్లాప్స్ పడుతున్నాయి. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ పవర్ స్టార్ బాడీ ప్లెక్సిబులిటీ, స్టైల్ చూసి స్టన్ అయి పోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు హరీష్.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. బండ్ల గణేష్ నిర్మాత. పవన్ కళ్యాణ్ ఇందులో పవర్ ఫుల్ కొండవీడు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. చట్టం చూపిన దారిలో వెళితే నేరస్తులను అదుపులో పెట్టడం చాలా కష్టం. అందుకే గబ్బర్ సింగ్ తనదైన శైలిలో రౌడీలకు రౌడీగా తన తడాఖా చూపిస్తూ ఉంటాడు. సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన బాలీవుడ్ ‘దబాంగ్’ సినిమాకు ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే.
ఏప్రిల్ చివరి వారంలో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఇంకా నాగబాబు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాణం: పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్.

Post a Comment