చాలా కాలం తర్వాత ఈ రోజు(గురువారం) హైదరాబాద్ వచ్చిన నటి స్నేహ చాలా సంతోషంగా కనబడింది. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్ లో జరిగిన ఓ కార్య్రకమంలో ఉత్సాహంగా కనిపించిన ఆమెను మీడియా ప్రతినిధులు కదిలించారు. ఇంత సంతోషంగా ఉన్నారేమిటి? అని ప్రశ్నించగా ఈ సంతోషం అంతటికీ కారణం నాగార్జునే. శ్రీరామ దాసు తర్వాత ఆయన చేస్తున్న చారిత్రాత్మక చిత్రం రాజన్నలో తనకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. మళ్లీ ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందం ఉంది అని పేర్కొన్నారు.
నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన యదార్ధ సంఘటనను బేస్ చేసుకుని రూపొందిన ‘రాజన్న’ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయేంద్రవర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని యాక్షన్ పార్టును రాజమౌళి డైరెక్ట్ చేశారు. కీరవాణి అందించిన పాటలకు ఇప్పటికే మంచి స్పందన వస్తోంది. ట్రైలర్స్ అదిరిపోయేలా ఉండటంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
నాగార్జున కూడా రాజన్నపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. తన కెరియర్ లోనే ఒక మరిచిపోలేని హిట్ గా ఈ సినిమా నిలుస్తుందని నాగార్జున ఆశాభావం వ్యక్తం చేశారు.

Post a Comment