బాలీవుడ్ సెక్సీబాంబ్ బిపాసాబసు బికినీ వేసిందంటే కుర్రకారు వెర్రెత్తి పోవాల్సిందే. గతంలో వచ్చిన ‘ధూమ్-2′లో బిపాసా టు పీస్ బికినీలో సముద్రం ఒడ్డున అందాలను బాగానే ఆరబోసింది. మళ్ళీ ‘ప్లేయర్స్’ చిత్రంలో అలాంటి దుస్తులను వేసుకోవడానికి రెడీ అవుతోంది బిప్స్. అభిషేక్‌బచ్చన్, బాబీడియోల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో అభిషేక్ సరసన సోనమ్‌కపూర్, బాబిడియోల్ సరసన బిపాసా నటిస్తోంది. ఇందులో ఓ సందర్భంలో బిపాసా బికినీలో నటించాల్సి ఉందట. బికినీలో చక్కటి శరీరసౌష్టవం కనిపించడంకోసం దర్శకుడు అబ్బాస్‌భర్మావాలా కొద్దిరోజులు జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండాలని బిపాసాకి సూచించాడట. దీంతో బిపాసా మూణ్నెల్లపాటు తనకిష్టమైన జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు నాజూగ్గా ఉండేందుకు ఫ్రూట్ జ్యూస్, సలాడ్‌తోలాంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటోందట ఈ ముద్దుగుమ్మ.
Home »
» బికినిలో బిపాసా

Post a Comment