.
Home » » చరణ్ , సమంత జంటగా ‘ఎవడు’

చరణ్ , సమంత జంటగా ‘ఎవడు’

Written By Hot nd spicy on Thursday, 15 December 2011 | 19:21

రామ్‌చరణ్ తేజ, సమంత, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ఎవడు’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఉదయం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి చిరంజీవి క్లాప్ ఇవ్వగా అల్లు అరవింద్ స్విచాన్ చేశారు. తొలి సన్నివేశానికి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి గౌరవ దర్శకత్వం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ -‘కమర్షియల్ ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్ సబ్జెక్టుతో రూపొందుతున్న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నాం. షూటింగ్ అంతా ఆంధ్రప్రదేశ్‌లోనే జరగనుంది. అల్లు అర్జున్ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. జనవరి నుండి షెడ్యూల్స్ ప్రారంభమవుతాయ’ని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయికుమార్, వక్కంతం వంశీ, అల్లు అర్జున్, అశ్విన్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, కెమెరా: చోటా కె నాయుడు, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్, నిర్మాత: రాజు, స్క్రీన్‌ప్లే దర్శకత్వం: వంశీ పైడిపల్లి.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger