ప్రస్తుతం ‘డిపార్ట్‌మెంట్’ తీస్తున్న రాంగోపాల్‌వర్మ తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించారు. 26/11 ముంబై దాడుల సంఘటన ప్రధానంగా ఈ చిత్రాన్ని తీస్తానని ఆయన ప్రకటించారు. నవంబర్ 26 నుంచి వరుసగా మూడు రోజుల పాటు పాకిస్తాన్‌కు చెందిన తీవ్రవాదులు ముంబై వ్యాప్తంగా జరిపిన బాంబు దాడుల్లో 164 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా గాయాల పాలయ్యారు. “ఏ ఒక్క భారతీయుడూ మరచిపోలేని తేదీల్లో 26/11 ఒకటి. మూడు రోజులపాటు టెలివిజన్‌లో 24 గంటలూ ప్రసారమైన ఆ టెర్రరిస్టు దుశ్చర్యని ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చూశారు. ఆ సమయంలో ఏం జరిగిందన్న సంగతిని ప్రతి ఒక్కరూ కొద్దోగొప్పో చూశారు లేదా విన్నారు. అయితే ఆ రోజు భౌతికంగా ఏం జరిగిందన్న విషయాన్ని మాత్రమే కాక కసబ్, మిగతా టెర్రరిస్ట్ బృందం అమర్‌సింగ్ సోలంకికి చెందిన ట్రాలర్‌పై దిగడం నుంచి గిర్గామ్ చౌపట్టీ వద్ద కసబ్‌ని దివంగత తుకారాం ఒంబాలే పట్టుకునేంత వరకు తెరవెనుక జరిగిన విషయాల్ని కూడా నా సినిమాలో చూపించబోతున్నా.
పరిస్థితిని అదుపులో పెట్టడానికి వివిధ పోలీసాఫీసర్లు ఏమేం చేశారో ఈ సినిమాలో చూపిస్తాం. ఈ సినిమా కోసం ‘కసబ్ ద ఫేస్ ఆఫ్ 26/11′ పుస్తక రచయిత రోమెల్ రోడ్రిగ్స్ సహకారం తీసుకోబోతున్నా. ఆ సంఘటనపై ఆయన విస్తారంగా అధ్యయనం చేశారు. అయితే నా సినిమా ఆయన పుస్తకం ఆధారంగా తీయడం లేదు. ఇటు భారతీయ, అటు అంతర్జాతీయ ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా రూపొందిస్తాను. నటులు కాకుండా అప్పటి వాస్తవ సంఘటనలే హైలైట్ అవడం కోసం పూర్తిగా కొత్త తారలే ఇందులో నటిస్తారు. సోకాల్డ్ అండర్‌వరల్డ్ (మాఫియా) సినిమాలే ఎక్కువగా తీస్తూ వచ్చిన నా కెరీర్‌లో ఈ సినిమా అతి పెద్ద సవాలు” అని తన ప్రకటనలో వివరించారు వర్మ.

Post a Comment