నందమూరి నటసింహం బాలకృష్ణ చాలా విషయాల్లో సెంటిమెంటును ఫాలో అవుతారనేది కొత్తగా చెప్పక్కర్లేదు. ఆ సెంటిమెంటుతోనే లక్కీ హీరోయిన్ ఇషా చావ్లాకు మరో అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నాడట. ప్రస్తుతం ఇషా చావ్లా బాలయ్యతో కలిసి ‘శ్రీమన్నారాయణ' చిత్రంలో నటిస్తోంది. ఆమె పెర్ఫార్మెన్స్ బాగా నచ్చడానికి తోడు...గతంలో ఆమె నటించిన ప్రేమకావాలి, పూలరంగడు చిత్రాలు సక్సెస్ కావడంతో బాలయ్య కన్ను మరోసారి ఇషాపై పడింది.
సింగితం శ్రీనివాస్ దర్శకత్వంలో తన గత సినిమా ‘ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందబోతున్న ‘ఆదిత్య 999' చిత్రంలో ఇషా చావ్లాను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.
బాలయ్య ప్రస్తుతం ‘శ్రీమన్నారాయణ' చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రానికి రవి చావలి దర్శకత్వం వహిస్తుండగా ఎల్లోఫ్లవర్స్ పతాకంపై పుప్పాల రమేష్ నిర్మిస్తున్నారు. పార్వతి మెల్టన్, ఇషా చావ్లా హీరోయిన్లు. ఆగస్టు చివరి వారంలో ఈచిత్రం విడుదల కానుంది.
బాలకృష్ణ మరో పౌరాణిక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ఆంధ్ర భోజ శ్రీ కృష్ణదేవరాయలు చరిత్ర ఆధారంగా ఒక చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు.

Post a Comment