Mega Family is ruling the box office
హైదరాబాద్ :అల్లు అర్జున్ తాజా చిత్రం జులాయి టాక్ డివైడ్ గా ఉన్నా కలెక్షన్స్ బాగున్న సంగతి తెలిసిందే. ఈ నేఫద్యంలో మెగా ఫ్యామిలీకు భాక్సాఫీస్ వద్ద తిరిగులేదనే అంటున్నారు. ఈ సంవత్సరం రామ్ చరణ్ తేజ..చిత్రం రచ్చ విజయం సాధించటం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చిత్రం గబ్బర్ సింగ్ ఘన విజయం సాధించటం ఇప్పుడు జులాయి..ఇలా వరసగా మెగాఫ్యామిలీ హీరోలు విజయాలు సాధిస్తున్నారు. ఇదే వరసలో మెగా ఫ్యామిలీనుంచి వస్తున్న మరో హీరో సాయి ధరమ్ తేజ సినిమా రేయ్ కూడా విడుదల కు సిద్దమవుతోంది.మరో ప్రక్క రామ్ చరణ్ వరసగా మూడు చిత్రాలతో తెరమీదకు దూకటానికి రెడీ అవుతున్నాడు. వాటిల్లో మొదటిది రామ్ చరణ్,వివివినాయిక్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం. ఈ చిత్రానికి నాయక్ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. అలాగే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎవడు చిత్రం కూడా రెడీ అవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ గా చేస్తున్నారు. మరో ప్రక్క జంజీర్ రీమేక్ చిత్రాన్ని తెలుగులో సైతం డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కు గానూ..యోగి డైరక్ట్ చేస్తున్నారు.
మరో ప్రక్కన పవన్ కళ్యాణ్ సైతం వరసగా సినిమాలు చేస్తున్నారు. గబ్బర్ సింగ్ వంద రోజులు పండగ పూర్తయ్యేసరికి పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మరో చిత్రం రిలీజ్ కు రెడీ చేసేస్తున్నారు. కెమెరామెన్ గంగతో రాంబాబు టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరో ప్రక్క త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం కమిటయ్యారు. కుటుంబ అనుభందాలు,తెలుగు సంప్రదాయాలు నేపధ్యంలో త్రివిక్రమ్ ఈ చిత్రం స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. అల్లు అర్జున్ ..ఇద్దరు అమ్మాయిలుతో... పేరుతో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ చిత్రం కమిటయ్యారు.
Post a Comment