ఎప్పుడూ ఏదో ఒక వివాదం, సంచలన ప్రకటనలు, తన టింగరి వేషాలతో వార్తల్లో నిలుస్తూ పబ్లిసిటీ పెంచుకోవడమే లక్ష్యంగా సాగుతున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి అందరి నోట చర్చనీయాంశం అయ్యాడు. ఈ సారి వర్మ ఏం చేశాడో తెలుసా? బాబాలు, స్వామీజీల మాదిరి తనను తాను ‘దేవుడు’గా ప్రకటించుకున్నాడు. ఇందుకు తన ట్విట్టర్‌ను వేదికగా చేసుకున్నాడు.
తాను గత జన్మలో దేవుడిని...అంటూ రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అసలు దేవుడంటే నమ్మకం లేదని గతంలో ఉన్నోసార్లు ప్రకటించిన వర్మ....ఇప్పుడు ఇలా తనను తాను దేవుడిగా ప్రకటించుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ హిందీలో ‘డిపార్ట్ మెంట్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, అమితాబ్, తెలుగు హీరో రాణా, మంచు లక్ష్మి, మధు శాలిని తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ‘రామాయణం’ సినిమాతో పాటు ‘అమ్మా 3డి’ అనే చిత్రాలను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Post a Comment